బిగ్ రిలీఫ్.. ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి

by Mahesh |   ( Updated:2024-09-09 10:41:29.0  )
బిగ్ రిలీఫ్.. ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఏపీ, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు తోడు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా వరద వచ్చింది. ఈ క్రమంలో బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో ఉన్న ఇసుక బోట్లు అదుపుతప్పి.. బ్యారేజీ వైపు వేగంగా దూసుకు వచ్చి మూడు గేట్లను ఢీకొట్టాయి. దీంతో బ్యారేజీలోని 67, 69, 70 గేట్ల వద్ద ఉన్న గేట్ల కౌంటర్‌ వెయిట్లు దెబ్బతిన్నాయి. ఇది గమనించిన అధికారులు నిపుణుల సాయంతో 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్ల మరమ్మతులు ప్రారంభించారు. కాగా ఈ రోజు మధ్యాహ్న సమయానికి పనులు పూర్తయ్యాయని.. దెబ్బతిన్న స్థానంలో కౌంటర్ వేయిట్ స్థానంలో స్టీల్‌తో చేసిన భారీ కౌంటర్‌ వెయిట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజేక్టుల గేట్లను ఎత్తడంతో ఈ వరద కొనసాగుతుండగా.. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed