- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Remand Report: రాజంపేట సబ్ జైలుకు పోసాని.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

దిశ, వెబ్‌డెస్క్: కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని కేసు నమోదైన నేపథ్యంలో నటుడు, మాజీ వైసీపీ (YCP) నేత పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)ను ఓబులవారిపల్లి (Obulavaripalli) పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రైల్వేకోడూరు కోర్టు (Railway Kodur Court)లో ప్రవేశపెట్టగా జడ్జి (Railway Kodur Court Judge) రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే పోలీసుల తయారు చేసిన రిమాండ్ రిపోర్టు (Remand Report)లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మొదటగా కులాల మధ్య చిచ్చు పెట్టారంటూ పోలీసులు అభియోగం మోపారు. అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan), కుటుంబాన్ని కూడా నోటికి వచ్చినట్లుగా దూషించారని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమకు ఓ కులాన్ని ఆపాదించారని తెలిపారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)ను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. మహిళలు అని కూడా చూడకుండా కించపరిచేలా మాట్లాడారని, నందీ అవార్డు కమిటీ (Nandi Award Committee)పై కులం పేరుతో దూషించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు (Remand Report)లో వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)పై ఇప్పటికే 14 కేసులు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు. కాగా, కేసులో పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా (Annamayya District) ఓబులవారిపల్లి పోలీసులు రైల్వే కోడూరు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పోసానిని అక్కడి నుంచి రాజంపేట సబ్ జైలుకు తరలించారు.