పురంధేశ్వరికి సిగ్గుశరం లేదు..చంద్రబాబు గుండెకి బొక్కపడలేదు : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

by Seetharam |
పురంధేశ్వరికి సిగ్గుశరం లేదు..చంద్రబాబు గుండెకి బొక్కపడలేదు : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి సిగ్గు శరం లేదని మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి‘బీ’టీంగా పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆనాడు ఎన్టీఆర్‌కి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులలో పురంధేశ్వరీ కూడా ఒక్కరు అని ఆరోపించారు. కన్నతండ్రికి నమ్మకం ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తి పురంధేశ్వరి అని కొడాలి నాని ఆరోపించారు. కన్న తండ్రి వెన్నుపోటు పోడిచి ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి ఆయన మానసిక వేదనతో మరణించేలా చేసిన కూతురు ప్రపంచంలో ఏ తండ్రికి ఉండరు అని మాజీమంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.

నాడు పురంధేశ్వరికి వాటాలందాయ్

తెలుగుదేశం హయాంలో ఇసుక దోపిడీ భారీగా జరిగిందని మాజీమంత్రి కొడాలి నాని ఆరోపించారు. అయితే ఆ సమయంలో పురంధేశ్వరికి కూడా వాటాలు వెళ్లేవి అని కాబట్టే ఆమె నాడు విమర్శలు చేయలేదన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4000కోట్లు ఆదాయం వచ్చింది అని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక మీద ఒక్కరూపాయి కూడా రాలేదు మీరంతా కలిసి అ డబ్బులు దోచుకోలేదా...?అని మాజీమంత్రి కొడాలి నాని నిలదీశారు. పురంధేశ్వరి సిగ్గుశరం లేకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగిందని మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు.

గుండెకు బొక్కపడిందని చంద్రబాబు నాటకాలు

దగ్గుబాటి పురంధేశ్వరి చరిత్ర తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసునని మాజీమంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. తండ్రికి వెన్నుపోటు పోడిచి ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్‌లో చేరి లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి ఏ పార్టీలో చేరతారో ఆ పార్టీ భూస్థాపితం అయిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. పురంధేశ్వరికి రాష్ట్ర ప్రజలు 2014,2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సిగ్గుశరం లేకుండా విమర్శలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అవాకులు చేవాకులు పెలితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. మరోవైపు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలై చికిత్సపొందుతున్న చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ మీద బయట ఉండటానికి గుండెకు బోక్క పడిందని చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నాడు అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ అని అభిప్రాయపడ్డారు. దొంగ దొరికిన తరువాత ఇప్పుడు వాటిని తప్పించుకోవడానికి అనేక నాటకాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎటువంటి అవినీతికి తావివ్వకుండా సుపరిపాలన పాలన అందిస్తున్నారు అని మాజీమంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story