Daggubati Purandeswari : జనసేనతో పొత్తు విషయంపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2023-10-03 15:56:22.0  )
Daggubati Purandeswari : జనసేనతో పొత్తు విషయంపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన పొత్తు ఇప్పటికే ప్రకటించగా.. ఆ రెండు పార్టీలు కలిసి ఇప్పటినుంచే పనిచేస్తున్నాయి. అయితే ఆ రెండు పార్టీల పొత్తుతో బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటనేది స్పష్టంగా అర్థమైంది. తమ కూటమితో బీజేపీ కలిసి రావాలని పవన్ కోరుతుండగా.. కానీ కాషాయ పార్టీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. వైసీపీతో కాస్త సన్నిహితంగా ఉంటుండగా.. టీడీపీ, జనసేనతో కూడా సానుకూలంగా వ్యవహరిస్తోంది. పవన్ మాత్రం బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తును ప్రకటించారు. బీజేపీ కూడా కలిసొస్తే మంచిదనే, లేకపోతే తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు.

ఈ క్రమంలో తాజాగా జనసేనతో పొత్తు విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి జనసేన తమ మిత్ర పక్షంగానే కొనసాగుతోందని, టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. తమది జాతీయ పార్టీ అని, పొత్తు గురించి ఇప్పటికప్పుడు నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. పవన్ అభిప్రాయంపై వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని పేర్కొన్నారు.

టీడీపీ-జనసేన ఇప్పటికే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. రెండు పార్టీల నేతలు కలిగిన ఒక సమన్వయ కమిటీ త్వరలోనే నియామకం కానుంది. ఈ కమిటీలో ఇరు పార్టీల నుంచి ఎవరు ఉండాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్రలో టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. వారాహి యాత్రలో టీడీపీ జెండాలు కూడా కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed