- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking News: ఢిల్లీకి పయనమైన పురంధేశ్వరి.. దానికోసమేనా..?
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బైరెడ్డి శబరి బీజేపీ అధ్యక్ష పదవికి అలానే ప్రాథమిక సభ్యతానికి రాజీనామా ఇచ్చారు. ఇక ఆళ్లగడ్డ ఇంఛార్జ్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న భూమా కిషోర్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రోజు నంద్యాల పర్యటనకు సన్నాహాలు చేసుకున్నారు.
కానీ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని ఢిల్లీ బాట పట్టారు. అయితే చివరి నిమిషంలో ఆమె నంద్యాల పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి బయలుదేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఏపీ బీజేపీ శ్రేణుల సమాచారం ప్రకారం.. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించేందుకు పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ ఇటీవలే జిల్లాల్లోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ.. పార్టీ బలాబలాలపై వరుస సమావేశాలు నిర్వహించి.. ఏపీలో పార్టీ పరిస్థితి.. ఏయే స్థానాల్లో పోటీ చేయగలమనే అంశంపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ విడుదల చేయనున్న రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలు కూడా ఉంటాయని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
కాగా ఈ విషయం పై అధిష్టానంతో మాట్లాడేందుకు పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ఇక టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు వ్యవహారం కూడా ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్తారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
Read More..
ఢిల్లీలో ఏపీ రాజకీయాలు.. ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు