Sp Malika Garg: భార్య గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు..

by srinivas |
Sp Malika Garg: భార్య గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కోట రాధ(35) హత్యకేసును పోలీసులు ఛేదించారు. రాధను హత్య చేసింది ఆమె భర్త మోహన్ రెడ్డియేనని తేల్చారు. చున్నీతో రాధ గొంతునులిమి హత్య చేసిన మోహన్ రెడ్డి అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. ఈ హత్య ఘటనపై సోమవారం ఎస్పీ మలికా గార్గ్ ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. రాధ, మోహన్‌రెడ్డి దంపతులు హైదరాబాద్‌లో నివశించేవారని ఎస్పీ తెలిపారు.

అయితే రాధ స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డికి రూ.80లక్షలు అప్పు ఇచ్చారని తెలిపారు. అయితే డబ్బులు ఇవ్వాలని కేతిరెడ్డి కాశిరెడ్డిని అడిగితే ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. కాశిరెడ్డి తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా కోర్టులో ఐపీ దాఖలు చేశారని అప్పటి నుంచి రాధ, మోహన్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. రాధకు కేతిరెడ్డి కాశిరెడ్డి చిన్న నాటి స్నేహితుడు కావడం డబ్బులు ఇప్పించడంతో ఆమెపై భర్త అనుమానం కూడా పెంచుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి భార్యను అడ్డు తొలగించాలని కుట్రపన్నినట్లు తెలిపారు. అయితే ఈ నెల 11న రాధ చౌడేశ్వరిదేవీ పూజల నిమిత్తం తన పుట్టింటికి కుమారులతో కలిసి రాధ వచ్చింది. ఇదే హత్య చేసేందుకు సమయం అని మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.

అంతే ఇతరుల ప్రూఫ్‌లతో వేరే సిమ్ తీసుకున్నాడు. ఆ సిమ్‌ వేసుకుని భార్యతో కాశిరెడ్డిలా ఛాటింగ్ చేశాడు. డబ్బులు ఇస్తానని చెప్పి ఈనెల 17న మోహన్ రెడ్డి రాధాకు మెసేజ్ చేశాడు. ఆమెను కనిగిరి రప్పించి కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. తన మెుబైల్ తోపాటు పలువురు మొబైల్‌లో సిమ్ వేసుకుని మరీ చాటింగ్ చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. కారులో ఎక్కించుకుని కనిగిరి రప్పించి కారులో ఎక్కించుకొని వెళ్లి ఊరి శివారులో గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడని.. అనంతరం మతదేహాన్ని జిల్లెలపాడు గ్రామశివారులో పడేసి ఆమెపై కారును ఎక్కించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. పక్కా పథకంతోనే భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ఎస్‌పి మలికాగార్గ్‌ తెలిపారు. నిందితుడు మోహన్ రెడ్డిని ఈనెల 21న అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు.

Advertisement

Next Story