Breaking news: టీడీపీలో చేరిన ప్రముఖ టాలీవుడ్ హీరో

by Indraja |   ( Updated:2024-03-30 07:03:15.0  )
Breaking news: టీడీపీలో చేరిన ప్రముఖ టాలీవుడ్ హీరో
X

దిశ, ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అటు క్రికెటర్లు, ఇటు సినిమా హీరోలు రాజకీయాల బాటపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిఖిల్ సిద్ధార్థకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

టీడీపీ గూటికి చేరిన నిఖిల్ ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారని సమాచారం. కాగా హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీ అభ్యర్థి కొండయ్య యాదవ్ కి అల్లుడు. ఈ నేపథ్యంలో మామ గెలుపుకోసం అల్లుడు టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని సమాచారం.

Read More..

Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి శ్రీకారంచుట్టిన జనసేనాని.. నేడు ఆ నియోజకవర్గంలో పర్యటన

Advertisement

Next Story