Shakthi App: జస్ట్​ ఫోన్​ మూవ్ ​చేస్తే చాలు.. నిమిషాల్లో పోలీసులు అలర్ట్​

by Anil Sikha |   ( Updated:2025-03-13 14:55:02.0  )
Shakthi App: జస్ట్​ ఫోన్​ మూవ్ ​చేస్తే చాలు.. నిమిషాల్లో పోలీసులు అలర్ట్​
X

మహిళలకు అండగా శక్తి యాప్​

మరింత సులువుగా..అత్యాధునిక ఫీచర్లు

గతవారంలో లాంచ్​చేసిన సీఎం

ఫోన్​అటు ఇటు ఊపినా పోలీసులకు సమాచారం

మహిళల భద్రత కోసం మరింత మెరుగుపరుస్తాం.. మంత్రి అనిత

దిశ, డైనమిక్ ​బ్యూరో: మీ చేతిలో ఉన్న ఫోన్​ అలా ఊపితే చాలు.. వెంటనే పోలీసులు అలెర్ట్​ అవుతారు.. అది ఎక్కడో అమరికాలో కాదు.. ఏపీలోనే..(Ap Government)! మహిళల, చిన్నారుల భద్రత కోసం ఏపీ గవర్నమెంట్​శక్తి అనే యాప్​ను తీసుకువచ్చింది. దానిని గత ఉమెన్స్​డే నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) ప్రారంభించారు. ఈ రోజు పోలీస్​ కమిషనర్​ కార్యాలయంలో శక్తి యాప్​పై హోమంత్రి వంగలపూడి అనిత (Home minister Anitha) సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల భద్రతే తమకు ప్రధానం అని అన్నారు. శక్తి యాప్​ను ఇప్పటికే చాలామంది డౌన్​లోడ్​చేసుకున్నారని తెలిపారు. దానిని ఇంకా మెరుగ్గా అప్​గ్రేడ్​చేస్తామన్నారు. ఇందులో పది సేవలు ఉన్నాయని తెలిపారు. గృహహింస, అత్యాచారం, లైంగిక దాడులు, ఈవ్‌ టీజింగ్, యాసిడ్‌ దాడులు, మానవ అక్రమ రవాణా, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, కిడ్నాప్, సైబర్‌ బుల్లీయింగ్, ఫొటో మార్ఫింగ్‌ తదితర నేరాలపై కంప్లైంట్ చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.

మహిళల భద్రత కోసం శక్తి యాప్​ను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఏపీ పోలీసు శాఖ దీనిని రూపొందించింది. ఈ యాప్​ను మహిళలు ఫోన్​లో డౌన్​లోడ్​ చేసుకుని అందులో ఉన్న ఎస్​వోఎస్​(SOS) నొక్కితే నిముషాల్లో పోలీసులు ఘటన స్థలానికి వస్తారు. ఆపదలో చిక్కుకున్న మహిళలు ఈ యాప్‌ ఓపెన్‌ చేసి అందులోని ఎస్​వోఎస్​ ఆప్షన్‌పై నొక్కితే, వెంటనే 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో రికార్డు అయి లొకేషన్‌తో సహా పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు వెళుతుంది. బటన్​నొక్కలేని పరిస్థితుల్లో ఉంటే ఫోన్​అటూ ఇటూ ఊపినా చాలు.. సమాచారం కంట్రోల్​రూంకి వెళుతుంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రక్షిస్తారు. అయితే ఈ యాప్​సెట్టింగ్స్‌లోని హ్యాండ్‌ గెస్చర్‌ అనే ఆప్షన్‌ ఆన్‌ చేసి ఉంచుకోవాలి.

గృహహింస వంటివి ఎదుర్కొంటున్న మహిళలు ఎటువంటి అత్యవసర పరిస్థితిలో అయినా ఇంటినుంచే ఈ యాప్​ ద్వారా కంప్లయింట్ పోలీసులకు చేయవచ్చు. యాప్​లో ఉన్న గివ్‌ ఏ కంప్లైంట్‌ (Give a complaint) విభాగంలోకి వెళ్లి, అందులో సంబంధిత జిల్లా, పోలీసుస్టేషన్‌ను ఎంపిక చేసుకుని, ఫిర్యాదు చేస్తున్న అంశంతో పాటు వివరాలను నమోదు చేస్తే సరి. ఫిర్యాదుదారు కాగితంపై రాసి అయినా అప్​లోడ్​ చేయవచ్చు. గృహహింస, కుటుంబ తగాదాలు తదితర అంశాలపై ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ తీసుకునేందుకు ఈ యాప్‌ ద్వారా సాయం కోరవచ్చు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుస్టేషన్లు, అక్కడి ఎస్‌హెచ్‌వోల ఫోన్‌నంబర్లు ఉంటాయి. మహిళలు ఒంటరిగా ఒక చేటి నుంచి మరో చోటికి ప్రయాణిస్తున్నపుడు ఈ యాప్​లో సేఫ్‌ ట్రావెల్‌ (safe travel) ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే ఉపయోగం. అందులో న్యూ ట్రాక్‌ రిక్వెస్ట్‌ లోకి వెళ్లి బయల్దేరిన ప్రాంతం, గమ్యస్థానం వివరాలు, వెళ్తున్న వాహనం నంబరు తదితరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది వెళ్లే మార్గాన్ని పోలీసు కంట్రోల్‌ రూం నుంచి గమనిస్తారు. వాహనం వెళ్లాల్సిన రూటు లో కాకుండా మరో దారిలో వెళుతుంటే పోలీసులు అప్రమత్తం అవుతారు.

Read Also..

Andhra University: ఏయూ మాజీ వీసీపై అక్రమాలపై విజిలెన్స్ విచారణ

Next Story

Most Viewed