సీఎం జగన్‌పై దాడి కేసులో కోర్టులో పిటిషన్..?

by Jakkula Mamatha |   ( Updated:2024-04-18 14:16:19.0  )
సీఎం జగన్‌పై దాడి కేసులో కోర్టులో పిటిషన్..?
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై రాయితో దాడి కేసులో విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో అజిత్‌సింగ్ నగర్‌లోని వడ్డెర కాలనీకి చెందిన కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలిసింది. వారి ఆచూకీ చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకుల ప్రోత్సాహంతోనే పోలీసులు తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరిని ఇరికిస్తారోని భయంతో కొందరు వేరే ప్రాంతలకు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురు అనుమానితుల వివరాలు తెలపాలంటూ సలీం అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యవహారంపై కమిషనర్‌ను నియమించాలని న్యాయవాది పేర్కొన్నారు. త్వరలోనే ఈ పిటిషన్ విచారణకు రానుంది.


Read More..

‘కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం’.. ఎన్నికలకు ముందే జోస్యం చెప్పిన మంత్రి

Next Story

Most Viewed