పవన్ స్పీచ్‌లో పూనకాలు, అరుపులు,తిట్లు తప్ప ఇంకేమీ లేవు : Sajjala Ramakrishna Reddy

by Seetharam |   ( Updated:2023-08-14 09:32:41.0  )
పవన్ స్పీచ్‌లో పూనకాలు, అరుపులు,తిట్లు తప్ప ఇంకేమీ లేవు : Sajjala Ramakrishna Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ హింసను ప్రేరేపిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని.... చట్టాలను పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలను అరాచక శక్తుల మూకగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.... పవన్ కల్యాణ్ యజమాని చంద్రబాబేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీకి పట్టిన శని చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇద్దరు నేతలు పనిగట్టుకొని, పద్ధతి ప్రకారం ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారమే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విరుచుకుపడ్డారు.ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ స్పీచ్‌లో పూనకాలు, అరుపులు, తిట్లు తప్ప ఇంకేమీ లేవన్నారు. పవన్ కల్యాణ్ ఏదో పిచ్చి కేకలు వేస్తే అభిమానులు ఈలలు వేస్తున్నారని ఇది కామన్ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

హింసలో చంద్రబాబు హస్తం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో హింసను ప్రేరేపిస్తున్నారు అని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు, అంగల్లు ఘటనలు వెనుక చంద్రబాబు నాయుడు హస్తం లేదా అని ప్రశ్నించారు. అంగల్లలో పోలీసులు సంయమనం పాటించారని లేకపోతే తీవ్ర ఇబ్బందులు జరిగేవని చెప్పుకొచ్చారు. అలాంటి చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలు భాగోలేదని..జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలో కొత్తేమీ లేదని చెప్పుకొచ్చారు. ఎల్లో మీడియాలో గత కొంతకాలంగా వచ్చిన వార్తలనే ప్రస్తావించారని సజ్జల వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారని...మరి ఇదే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడే సీబీఐని రాష్ట్రంలో ఎందుకు అడుగుపెట్టనివ్వలేదని చెప్పుకొచ్చారు. పుంగనూరు‌, అంగళ్లలో ఘోరం జరగాలనే చూశారని గుర్తు చేశారు. అధికారం అనేది ఆయన సొంతం అని చంద్రబాబు భావిస్తున్నారని.. అది లేకపోవడంతో ఉన్మాదిగా మారుతున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట

చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఓ విప్లవ పోరాటం చేసినంత బిల్డప్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పాలన అందించిందో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. ప్రజలు సైతం వైఎస్ జగన్‌కు జేజేలు పలకుతుండటంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎలాంటి సాకులు దొరకకపోవడంతో ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలు కేవలం శబ్ధకాలుష్యం తప్ప ఇంకేమీ ఉపయోగం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

పవన్ యజమాని చంద్రబాబే

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటికీ ప్యాకేజీ స్టారేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కల్యాణ్ ఆరోపనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో పవన్ కారుకూతలు, పిచ్చికూతలు కూశారంటూ విరుచుకుపడ్డారు. విశాఖ పర్యటనలో పవన్ కల్యాణ్ ఎందుకు అంతలా ఊగిపోతున్నారో ఆయనకైనా తెలుసా అని ప్రశ్నించారు. పవన్ ప్రసంగాలకు, వచ్చే ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్‌ లేవనెత్తిన అంశాలు సందర్భరహితం, అప్రస్తుతమన్నారు. పవన్ పూనకాలు దేనికి సంకేతం? పూనకం, అరుపులు, తిట్లు తప్ప పవన్ ప్రసంగంలో ఏమీ లేదు అని విమర్శించారు. అధికారంలోకి రావాలనే ఆలోచన పవన్ కల్యాణ్‌కు లేదని చెప్పుకొచ్చారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ పర్యటనలతో పవన్ కల్యాణ్ తనకు ఉన్న పాపులారిటీని తగ్గించుకొంటున్నారని మండిపడ్డారు. పవన్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పవన్ అడ్డగోలు ప్రశ్నలు వేస్తే.. ఎవరూ సమాధానం చెప్పలేరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed