- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP Deputy CM:చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం

దిశ,వెబ్‌డెస్క్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్(Sri Rangarajan) మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఫిబ్రవరి 07 వ తేదీన తెల్లవారుజామున చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై దాడి దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ దాడి పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను వ్యక్తి పై కాకుండా. ధర్మ పరిరక్షణ పై దాడిగా భావించాలని అన్నారు.
శ్రీ రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా ఆయన ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులం అని చెప్పి వెళ్లి శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు(Police) తేల్చాలని సూచించారు. వారు ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని తెలిపారు.
ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తీవ్రంగా పరిగణించాలి అన్నారు. టెంపుల్ మూమెంట్(Temple Moment) అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈ క్రమంలో చిలుకూరు వెళ్ళి శ్రీ రంగరాజన్‌ని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ(Janasena Party) తెలంగాణ(Telangana) విభాగానికి దిశానిర్దేశం చేశానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పత్రిక ప్రకటన ద్వారా వెల్లడించారు.