DCM:‘బాలకృష్ణను అలా పిలవడమే ఇష్టం’.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Jakkula Mamatha |
DCM:‘బాలకృష్ణను అలా పిలవడమే ఇష్టం’.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో విజయవాడ(Vijayawada) ఇందిరాగాంధీ స్టేడియంలో టాలీవుడ్ స్టార్(Tollywood Star) మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Music Director Taman) నేతృత్వంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ కార్యక్రమం శనివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh), సినీ నటుడు బాలకృష్ణ(Balakrishna) హాజరయ్యారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలసేమియా బాధితుల సహాయార్ధం ఎన్టీఆర్ ట్రస్ట్‌(NTR Trust)కు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari)న కలిసి చెక్‌ను అందిస్తానని తెలిపారు.

అయితే.. విజయవాడలో జరుగుతున్న ‘యూఫోరియా మ్యూజికల్ నైట్‌’ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలసేమియా బాధితుల కోసం నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని పవన్ కళ్యాణ్ అన్నారు. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు(Padma Bhushan Award) వచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ‘‘ఆయన నన్ను ప్రేమగా బాలయ్య అని పిలవమంటారు. కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. బాలకృష్ణను సార్ అని పిలవడమే తనకు ఇష్టమని’’ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒకటీ రెండు కాదు ఎన్ని తరాలు వచ్చినా సరే ప్రేక్షకులను ఆకర్షించే ఆయన నటన హర్షణీయం. సినిమాల్లోనే కాదని, సేవల్లోనూ బాలయ్య ముందుంటారని చెప్పారు. ఆ సేవలను గుర్తించి.. ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ఆయనకు పద్మభూషణ్ ఇచ్చిందన్నారు.

Next Story