Pawan Kalyan: వారాహి యాత్రకు పవన్ శ్రీకారం.. తొలి బహిరంగ సభ ఎక్కడంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-14 06:31:22.0  )
Pawan Kalyan: వారాహి యాత్రకు పవన్ శ్రీకారం.. తొలి బహిరంగ సభ ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వారాహి విజయయాత్రకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అన్నవరం నుంచి ర్యాలీగా కత్తిపూడి జంక్షన్ కు పవన్ వెళ్లారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో జనసేన చీఫ్ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ టూర్ చేపట్టనున్నారు. 9నియోజకవర్గాల్లో 10 రోజులు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. పవన్ యాత్ర నేపథ్యంలో జనసేన నాయకులు భారీగా అన్నవరం చేరుకున్నారు.

Also Read: రాజమౌళి- మహేష్ సినిమాలో రవితేజ.. ఏ పాత్రలో కనిపించబోతున్నారంటే!

Next Story

Most Viewed