Palnadu: దాచేపల్లిలో దారుణం.. స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి మృతి

by Ramesh Goud |
Palnadu: దాచేపల్లిలో దారుణం.. స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: బస్ డ్రైవర్(Bus Driver) నిర్లక్ష్యానికి(Negligence) ఇద్దరు మృతి (Two People Died) చెందిన దారుణ ఘటన పల్నాడు జిల్లాలో(Palnadu district) జరిగింది. విద్యార్థులను స్కూల్ కు తీసుకెళుతున్న సమయంలో రేడియేటర్ లో నీళ్లు అయిపోయాయని డ్రైవర్ బస్సును పక్కకు నిలిపాడు. బస్సులో ఉన్న 5వ తరగతి విద్యార్థిని రోడ్డు పక్కనే ఉన్న నర్సరీ కుంటలో నీళ్లు తెమ్మని డ్రైవర్ పంపించాడు. నీళ్లు తీచ్చేందుకు వెళ్లిన సుభాష్ అనే బాలుడు కాలు జారి నీటి కుంటలో పడ్డాడు. ఇది గమణించిన క్లీనర్ బాలుడ్ని కాపాడేందుకు కుంటలో దిగాడు. ఈత రాకపోవడంతో ఇద్దరు నీటి కుంటలోనే ప్రాణాలు విడిచారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story