కొత్త జిల్లాలపై ఫిబ్రవరి 26 వరకు అభ్యంతరాల స్వీకరణ

by Disha News Desk |
కొత్త జిల్లాలపై ఫిబ్రవరి 26 వరకు అభ్యంతరాల స్వీకరణ
X

దిశ, ఏపీ బ్యూరో :కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 26 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పరిపాలన సౌలభ్యం, సత్వర సేవలు లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కోరుకున్నట్లుగానే ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. అతి ముఖ్యమైన రూరల్ యూనివర్సిటీ, పారిశ్రామిక వాడ శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటాయని మంత్రి ధర్మన కృష్ణదాస్‌ తెలిపారు.

Advertisement

Next Story