కలసి వస్తున్న కళ్యాణాలు.. ఏపీ పాలిటిక్స్ లో న్యూ ట్రెండ్.

by Disha Web Desk 3 |
కలసి వస్తున్న కళ్యాణాలు.. ఏపీ పాలిటిక్స్ లో న్యూ ట్రెండ్.
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికల ప్రచార వేళ అభ్యర్దులకు కళ్యాణాలు కలసివస్తున్నాయి. ఓట్ల కోసం వంద మంది కార్యకర్తలను వెంటపెట్టుకొని ఎర్రటి ఎండలో నినాదాలు చేస్తూ రోడ్ల మీద తిరగడం కంటే పెళ్లిళ్లు ఉన్న రోజుల్లో అలా హాజరు వేయించుకువస్తే సరి. హాయిగా ఏదో మండపంలోనో, ఏసి హాలులోనో జరిగే పెళ్లికి వెళ్లి నాలుగు అక్షంతలు వేసి రెండు షోటోలకు ఫోజుఇచ్చి ఆప్యాయంగా ఏం బాబాయ్, ఏం తాతా అని పలకరిస్తే ఓట్లు వచ్చి పడిపోవా? ఇళ్ల దగ్గర కలవని ఓటర్లు, పల్లెటూర్లలో అయితే ఊరు ఊరు అక్కడే దొరకదా? అనుకున్నారేమోగానీ బొబ్బిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్ది , బొబ్బిలి చిన్నరాజు బేబీనాయన అదే పని చేస్తున్నారు.

ముహూర్తాలు ఎక్కువగా వున్న బుధవారం నాడు ఏకంగా నియోజక వర్గంలో జరిగిన 31 వివాహ కార్యక్రమాల్లో పాల్గొని రికార్డు స్రష్టించారు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని కార్యక్రమాలతోపాటు బాగండి మండలం, సీతానగరం మండలం, బొబ్బిలి మండలం , రామభద్రాపురం మండలంలో జరిగిన పెళ్లిళ్లన్నింటికీ వెళ్లి వచ్చేశారు. ఒక రకంగా నియోజక వర్గంలో ఆయన హాజరు కాని పెళ్లి అంటూ లేదు అంటే అతిశయోక్తి కాదు.

మామూలు రోజుల్లోనే నియోజక వర్గ ప్రజలు శుభ కార్యాలకు బొబ్బిలి కోట కు వచ్చి శుభలేఖలు ఇచ్చి వెళుతుంటారు. కుదిరినవాటన్నింటికీ బేబీనాయన హజరవుతుంటారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడం, ఆయనే అభ్యర్ది కావడంతో ఇలా కార్డు వస్తే అలా వెళ్లిపోతున్నారు. నియోజక వర్గంలోని ప్రతిగ్రామంలో నేతలను, ముఖ్యలను పేరు పెట్టి పిలచేంతటి పరిచయాలు వున్న ఆయనకు కార్యక్రమానికి వెళ్లిన తరువాత త్వరగా ముగించుకొని అక్కడ నుంచి బయటపడడమే కాస్త ఇబ్బందిగా వుందట.

అయినప్పటికీ నియోజక వర్గంలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ తలలోనాలుకగా చలామణి అవుతున్నారు. అన్నట్లు కేలలం వివాహాలే కాదు, చావులు, పరామర్శలకు కూడా ఇలాగే బేబీ నాయన హజరవుతుంటారు. మిగిలిన నేతలు బీబీ నాయనను చూసి ’ మీ ఓపిక కు జోహార్లు ’ అంటూ ఒక రకంగా అసూయ చెందుతున్నారని సమాచారం.

Read More..

BREAKING : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. పొందుపర్చిన సంచలన హామీలివే..!



Next Story

Most Viewed