వైసీపీకి కొత్త తలనొప్పి:మాజీమంత్రి బాలినేని సంచలన నిర్ణయం

by Seetharam |   ( Updated:2023-10-17 11:42:09.0  )
వైసీపీకి కొత్త తలనొప్పి:మాజీమంత్రి బాలినేని సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన గన్ మెన్ లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ సైతం రాశారు. మరోవైపు మంగళవారం ప్రభుత్వం తనకు కేటాయించిన నలుగురు గన్‌మెన్లను తిప్పి పంపించివేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్ల స్కాం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కుంభకోణంపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ స్కాం కేసులో వైసీపీ నేతలు ఉన్నా వదిలిపెట్ట వద్దని ఇప్పటికే పలుమార్లు పోలీసులకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. అయితే అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదు అంటూ బాలినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More..

స్పందించు ప్రభూ..

Advertisement

Next Story