- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ దళారిగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి ఇంటెలిజెన్స్ చీఫ్‌ను టార్గెట్ చేశారు. ఒక్కో ప్రెస్‌మీట్‌లో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేస్తున్నారు. గతంలో ఓసారి సీఎం వైఎస్ జగన్ మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్‌లపై విరుచుకుపడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఈసారి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులును టార్గెట్ చేశారు. ఆయనపై వాడీ వేడి విమర్శలు చేశారు. నెల్లూరులోని ఎమ్మెల్యే రూరల్ కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీతా రామాంజనేయులు రాజకీయ దళారిగా మారారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహార శైలి అంత బాగాలేదు అని చెప్పుకొచ్చారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విధులు మరిచిపోయి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన నేత పవన్ కల్యాణ్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతల కార్యకలాపాలపై నిఘా వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
పోలీసలు బలంతో వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మెహర్బానీ కోసం ఇదంతా చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఇంటెలిజెన్స్ చీఫ్ సలమాలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు అని ధ్వజమెత్తారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ఢిల్లీలో రామోజీ రావు పై ప్రెస్‌మీట్ పెట్టించేందుకు రామాంజనేయులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ట్రాప్‌లో ఉండవల్లి అరుణ్ కుమార్ పడొద్దని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రెస్‌మీట్‌కు సంబంధించి అంతా సీతారామాంజనేయులు దగ్గరుండి చూస్తున్నారని..ఉండవల్లి అరుణ్ కుమార్‌తో కలిసి రహస్య ప్రణాళిక రూపొందించారు అని కోటంరెడ్డి ఆరోపించారు. సీతారామాంజనేయులుకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్ వర్క్ ఉంటే..ఆయన దగ్గరే నాకు నెట్ వర్క్ ఉంది అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆరు నెలలు మాత్రమే నీ అధికారం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయ దళారీగా చేస్తున్న వ్యవహారాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.
Also Read..
Minister Roja: దేశంలోనే బెస్ట్ టూరిజం స్పాట్‌గా ఆంధ్రప్రదేశ్.