కడపలో నేచరల్ స్టార్ నాని సందడి

by Seetharam |
కడపలో నేచరల్ స్టార్ నాని సందడి
X

దిశ , డైనమిక్ బ్యూరో : నేచురల్ స్టార్ నాని కడపలో సందడి చేశారు. ఈ నెల 7న విడుదల కాబోతున్న ‘హాయ్ నాన్న’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కడపకు వచ్చారు. రెండో విజయదుర్గాదేవిగా పిలవబడే కడప విజయ దుర్గా దేవి ఆలయంలో నేచురల్ స్టార్ నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేచురల్ స్టార్ నానిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అనంతరం హీరో నాని మాట్లాడారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కడపకు వచ్చినట్లు తెలిపారు. సినిమా విజయవంతం అయ్యేలా చూడాలని దుర్గమ్మను ఆశీర్వదించినట్లు తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed