- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాళ్లకు నివాళులు.. అధర్మం పై ధర్మం విజయం సాధిస్తుంది..నారా లోకేష్
దిశ, డైనమిక్ బ్యూరో: రాజధాని కోసం పోరాడుతున్న రైతులపై నారా లోకేష్ X వేదికగా స్పందించారు.ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా ఓ పోస్ట్ చేశారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి నిలబడింది అమరావతి. ప్రజా రాజధాని కోసం 1500 రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలను కోల్పోయిన వాళ్లకు నివాళులు. వారి ఆశయం త్వరలోనే నెరవేరుతుంది. రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది. అధర్మం పై ధర్మం విజయం సాధిస్తుంది. అని పోస్ట్ లో రాసుకొచ్చారు.
కాగా ఈ పోస్ట్ పైన నెటిజన్స్ అనేకరకాలుగా స్పందిస్తన్నారు. కొందరు లోకేష్ జైల్ లో ఉంటె ఈ పోస్ట్ ఎలా చేస్తారు అని కామెంట్ చేస్తే.. అమెరికా జైల్లో ఎవర్రా నీకు ఫోన్ ఇచ్చింది.. తెలుగు తమ్ముళ్లను భలే ఎర్రిపప్పలను చేస్తున్నావ్ అని మరొకరు.. మీరు అమెరికాలో జైల్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిపైన క్లారిటీ ఇవ్వండి అని మరొకరు ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా నారా లోకేష్ అమెరికాలో జైల్ లో ఉన్నారు అనే వార్తలు వస్తున్న నేపధ్యంల.. నిజంగా లోకేష్ జైల్ లో ఉన్నారా..? ఉంటె ఈ పోస్ట్ ఎవరు చేశారు..? నిజంగా నారా లోకేష్ ఈ పోస్ట్ చేశారా..? లేక నారా లోకేష్ పేరుతో వేరెవరైనా చేశారా అనే విషయం పై స్పష్టత లేదు.
Read More: నారా లోకేష్ నిజంగా US పోలీసుల ఆధీనంలో ఉన్నారా..? ఇందులో వాస్తవమెంత ?