Rajnath singh: వివాదాలు, యుద్ధాలు హింసాత్మకంగా మారే చాన్స్.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by vinod kumar |
Rajnath singh: వివాదాలు, యుద్ధాలు హింసాత్మకంగా మారే చాన్స్.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న రోజుల్లో ఘర్షణలు, యుద్ధాలు మరింత హింసాత్మకంగా మారే చాన్స్ ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) అన్నారు. ప్రస్తుతం ఉగ్రవాద సమస్య అతి పెద్ద ఆందోళనగా ఉందన్నారు. 77వ ఆర్మీ డే వేడుకల్లో భాగంగా మహారాష్ట్ర (Maharashtra) లోని పూణెలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాయుధ బలగాలు ఆధునిక యుద్ధ యంత్రంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. భౌగోళిక రాజకీయ ప్రపంచ క్రమం, నిరంతరం మారుతున్న యుద్ధ స్వభావాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘వివాదాలు, యుద్ధాలు అనూహ్యంగా మరింత హింసాత్మకంగా మారుతాయని భావిస్తున్నా. పలు దేశాలు తీవ్రవాదాన్ని ఆశ్రయించడం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. సాయుధ బలగాలను సన్నద్ధం చేయడం ద్వారా వారి బలాన్ని పెంచేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. అత్యాధునిక ఆయుధాలను బలగాలకు అందజేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు.



Next Story

Most Viewed