‘నాగబాబుకు ఎమ్మెల్సీ వారసత్వం కాదు’.. ఆ పార్టీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-03-07 13:42:42.0  )
‘నాగబాబుకు ఎమ్మెల్సీ వారసత్వం కాదు’.. ఆ పార్టీ ఎమ్మెల్యే  కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాల్లో ఒక అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ ముఖ్యనేత కొణిదెల నాగబాబు(Konidela Nagababu) నేడు(శుక్రవారం) నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎమ్మెల్సీ(MLC) అభ్యర్థిగా నాగబాబును ప్రకటించడంతో పలువురు వైసీపీ నేతలు(YCP Leaders) విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్(MLA Bolishetti Srinivas) స్పందించారు. జనసేన పార్టీ కోసం కష్టపడ్డందుకే నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘పవన్ కళ్యాణ్ పిల్లలకు ఇస్తే వారసత్వమంటారు.. కానీ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి పదవులు దక్కితే వారసత్వమేలా?’ అవుతుందని ఆయన ప్రశ్నించారు. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో జనసేనలో అన్ని సామాజిక వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం దక్కిందన్నారు.

Next Story

Most Viewed