- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫీస్ ఆవరణలో స్నానం చేసిన మున్సిపల్ చైర్మన్
దిశ, డైనమిక్ బ్యూరో: తాడిపత్రి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్, అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి మున్సిపల్ ఆఫీసు వద్ద నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధికి అధికార పార్టీ నాయకులు ఆటంకం కలిగిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తూ నిరసన గళం విప్పారు. సోమవారం ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయం సమీపంలో డివైడర్ల మధ్య రాత్రి నిద్ర చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఆయనను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు.
అయినా.. ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద రాత్రి బస చేశారు. అనంతరం మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్దే బ్రష్ చేసుకున్నారు. అక్కడే స్నానం చేశారు. అనంతరం నిరసన శిబిరంలో కూర్చున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యాడికి, పెద్దపప్పూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. తాడిపత్రిలో అక్రమాలను అరికడతామని.. టీడీపీ కౌన్సిలర్లకు సహకరిస్తామని కమిషనర్ ప్రకటించాలని అప్పటి వరకు కార్యాలయం వదిలి వెళ్ళేది లేదని జేసీ ప్రకార్ రెడ్డి స్పష్టం చేశారు.