Vijayasai Reddy: 150 స్థానాల్లో కూడా పోటీ చేయలేరు.. ప్రతిపక్షాలపై సెటైర్లు

by srinivas |   ( Updated:2023-07-10 14:06:48.0  )
Vijayasai Reddy: 150 స్థానాల్లో కూడా పోటీ చేయలేరు.. ప్రతిపక్షాలపై సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: 175 కాదు...కనీసం 150 అసెంబ్లీ స్థానాల్లో సొంతంగా పోటీ చేసే సత్తా ప్రతిపక్ష పార్టీలకు లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ విషయం ప్రస్తావిస్తే ఒంటిరిగానో, కలిసికట్టుగానో, ఎలా పోటీకి దిగాలో చెప్పాల్సిన అవసరమేంటని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సింగిల్‌గా బరిలోకి దిగి విజయం సాధించిన వారికే చరిత్రలో స్థానం దొరుకుతుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

‘గెలుపు ఆశలు సన్నగిల్లుతుంటే టీడీపీ నిస్పృహలోకి జారిపోతోంది. వ్యాపారుల మధ్య గొడవలను కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు అంటగట్టే నీచపు ప్రయత్నాలు చేస్తోంది. ఎవరైనా కళ్లు తిరిగి కిందపడినా, జ్వరం వచ్చి పడుకున్నా దానికి వైసీపీదే బాధ్యత అనే స్థాయికి చేరుకున్నారు నేతలు. మీడియాలో ప్రచారం కోసం రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు.’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న 9 ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ యూనివర్సిటీ ఏర్పాటుతో సముద్ర మత్స్య సంపద వెలికితీతలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని విజయసాయిరెడ్డి చెప్పారు. సిఎం జగన్ వీటి కోసం రూ.3,800 కోట్లు వ్యయం చేస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్ల పనులు శరవేగంగా జరగుతున్నాయని, వీటిలో కోల్డ్ స్టోరేజీ, ప్రాసెసింగ్ సౌకర్యాలు ఉంటాయని విజయసాయి రెడ్డి తెలిపారు.

Read More..

Eluru: చెట్ల కింద చదువులు.. తీవ్ర ఆవేదనతో పవన్ ట్వీట్

Advertisement

Next Story

Most Viewed