- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking : వైసీపీ కి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా..!
దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అధికార పార్టీ అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో ఐప్యాక్ సర్వే ఆధారంగా సిట్టింగ్ ల విషయంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న విషయం అందరికి సుపరిచితమే. ఈ మార్పులు చేర్పులకు సంబంధించి గతంలో విడుదలైన మూడు జాబితాల నేపధ్యంలో సీటు దక్కని వారు.. అలానే స్థానబదీలీతో వైసీపీ అధిష్టానం తీరుకి అసహనానికి గురైన చాలామంది ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి వెళ్లారు. కాగా తాజాగా నాలుగో జాబితా కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధిని పక్కన పెట్టి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు అవకాశం కల్పిస్తూ తిరువూరు ఇంఛార్జిగా వైసీపీ అధిష్టానం నియమించింది.
దీనితో ఆగ్రహానికి గురైన సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో తనకు వైసీపీ నుండి సీటు రాదని ముందే సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీకి టచ్ లో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. కాగా వస్తున్న వార్తలు నిజమే అన్నట్లు ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రక్షణ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు రాకుండా 6 నెలలుగా కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఎంపీ కేశినేని నానికి టీడీపీ తో వచ్చిన విబేధాల నేపథ్యంలో వైసీపీ గూటికి చేరారని.. ఈ క్రమంలో నాని తనకు తిరువూరు సీటు కావాలని కండీషన్ పెట్టారని.. అందుకే వివిధ సర్వేలు చేసి ఓ పథకం ప్రకారమే తనకు సీటు లేకుండా చేశారని మండిపడ్డారు.
అలానే తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇస్తామని రాత్రి 12 గంటలకు మాట ఇచ్చారని.. కానీ మాట తప్పి తనకు పదవి ఇవ్వలేదని.. మంత్రి పదవి లేకపోయినా పార్టీకి నిబద్దతతో పని చేశానని పేర్కొన్నారు. కానీ చివరికి వైసీపీ తనకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనకు అన్యాయం చేసిన వైసీపీకి రాజీనామా చేసే అంశంపై క్యాడర్‌తో మాట్లాడి ఏ విషయం ప్రకటిస్తానని అన్నారు. అలానే టీడీపీలో చేరే విషయంపై కూడా మరోవైపు రెండు రోజుల్లో స్పస్టత ఇస్తానని వెల్లడించారు.
Read More..