‘మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి’.. RRR కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-02-22 04:50:25.0  )
‘మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి’.. RRR కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో మిర్చి తగ్గడం రాజకీయంగా ఘటెక్కిస్తోంది. గత సీజన్ వరకు క్వింటాల్ రూ.21 వేలకు పైగా పలికిన ధర ఒక్కసారిగా రూ.13వేలకు పడిపోయింది. డిమాండ్ తగ్గడంతో కొనుగోళ్లు, మద్దతు ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఆంధ్రపదేశ్‌లో మిర్చి బోర్డు(Mirchi Board) ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని డిప్యూటీ స్పీకర్(Deputy Speaker) రఘురామకృష్ణంరాజు(RRR) తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మిర్చి రైతుల సమస్యలు పరిష్కారించాలని అన్నారు. ఈ క్రమంలో పసుపు బోర్డు మాదిరిగానే మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ విషయమై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అయితే ఇటీవల మాజీ సీఎం జగన్ ఎన్నికల కోడ్(Election Code) ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లొద్దని పోలీసులు చెప్పిన వైఎస్ జగన్ వెళ్లారు. అంతటితో ఆగకుండా భద్రత కల్పించలేదని ఆరోపణలు చేశారని తెలిపారు. అయితే ప్రజలతో మమేకమయ్యేందుకు వెళ్లిన వైఎస్ జగన్‌కు అంత భయం ఎందుకు అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

Next Story