ఏపీలో భారీగా పడిపోయిన విద్యా ప్రమాణాలు.. ‘అసర్’ నివేదిక విడుదలతో తీవ్ర విమర్శలు

by srinivas |
ఏపీలో భారీగా పడిపోయిన విద్యా ప్రమాణాలు.. ‘అసర్’ నివేదిక విడుదలతో తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో విద్యా ప్రమాణాలపై జాతీయ సంస్థ ‘అసర్’(Aser) సర్వే చేసింది. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. గత పదేళ్ల విద్యకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో సర్వే చేసింది. ఈ సంస్థ చేపట్టిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ విధ్వంసమైనట్లు సర్వేలో తేలింది. 2018తో పోల్చితే 2019 నుంచి 2024 వరకూ ప్రభుత్వ స్కూళ్ల(Government School) విద్యా వ్యవస్థలో రాష్ట్రం వెనుకపడిందని స్పష్టం చేసింది. మూడో తరగతిలో ఉండి రెండో క్లాస్ పుస్తకాలు చదవడంలోనూ చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా ఉన్నారని, జగన్ పాలనలో తగ్గారని సర్వేలో తేలింది. 2018లో 22.6 శాతం ఉండగా.. 2022లో 10.5 శాతంగా ఉందని, 2024లో 14.7 శాతం తగ్గిందని అసర్ నివేదికలో వెల్లడైంది మూడో తరగతి చదువుతూ తీసివేతలు చేసే విద్యార్థుల శాతంలోనూ చంద్రబాబు, జగన్ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని పేర్కొంది. 2018లో 34.1 శాతం కాగా, 2022లో 29.2 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. 2018లో ఎనిమిదో క్లాస్ చదువుతూ రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వారు 78.6 శాతం ఉండగా, అదే జగన్ హయాం 2024లో 53 శాతానికి తగ్గిందని అసర్ నివేదికలో వెల్లడైంది.

జగన్ పాలన తీరుపై తీవ్ర విమర్శలు


దీంతో మాజీ సీఎం జగన్ పాలన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన హయాంలో ఇంగ్లీష్ మీడియం అంటూ హడావుడి చేయడాన్ని గుర్తు చేస్తూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ప్రచారానికి జగన్ మేనమామని, వాస్తవానికి కంసమామ అని మంత్రి లోకేశ్ తాజాగా ఎద్దేవా చేశారు. అసర్ నివేదిక అదే తేల్చిందని సెటైర్లు వేశారు. పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ.. జగన్ పాలనలో విద్యా ప్రమాణాలపై పెట్టలేదని విమర్శించారు. అడ్డగోలు జీవోలతో ప్రభుత్వ స్కూళ్లను మూయించివేశారని ఆరోపించారు. పాఠశాలల్లో సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు కనీసం రెండో తరగతి పుస్తకాలు కూడా చదవలేని పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ విద్యా వవస్థను త్వరలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలుసుకుని నూతన ఒరవడికి నాంది పలుకుతామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

Advertisement
Next Story

Most Viewed