- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మైనర్ బాలికపై జనసేన కార్యకర్త అత్యాచారం : బాలిక నోట్లో గుడ్డలు కుక్కి..తాళ్లతో చేతులు కట్టేసి ఘోరం
దిశ, డైనమిక్ బ్యూరో :ఏపీలో మహిళలు, బాలికపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో విద్యార్థినిలను ఉపాధ్యాయులు గర్భవతిని చేసిన ఘటన మరువకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి సమీపంలో రాత్రిపూట ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామంలో పంజా నాగేంద్ర అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. నాగేంద్ర పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. గత కొంతకాలంగా జనసేన పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాగేంద్ర అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై కన్నేశాడు.
అసలేం జరిగింది
ఈనెల 16న రాత్రి మైనర్ బాలిక తన ఇంటి బయట ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన నాగేంద్ర బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లాడు. బాలిక అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి... కాళ్ళుచేతులను తాళ్లతో కట్టేశాడు. అనంతరం ఊరిబయట నిర్మానుష్య ప్రాంతానికి బాలికను తీసుకెళ్లాడు. మైనర్ బాలికను వివస్త్రను చేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. బాలిక దండం పెట్టిన కూడా కరుణించలేదు. పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం అత్యాచారం విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించి వదిలేశాడు. అయితే బాలిక ఇంటికి వెళ్లి తనపై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాధిత బాలికను తీసుకుని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు మంగళవారం వీరవాసం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గుడు నాగేంద్రను కఠినంగా శిక్షించాలని పంజావేమవరం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.