జగన్ అంటేనే ఓ బ్రాండ్.. ఓ జోష్: సీఎంపై రోజా ప్రశంసల వర్షం

by Satheesh |   ( Updated:2023-03-04 05:26:59.0  )
జగన్ అంటేనే ఓ బ్రాండ్.. ఓ జోష్: సీఎంపై రోజా ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీకి ఊహించని రీతిలో పెట్టుబడులు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పర్యాటక రంగంలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడులకు ఎమ్‌ఓయూలు జరిగినట్లు రోజా వెల్లడించారు.

పర్యాటక రంగానికి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అంటే ఓ బ్రాండ్.. జగన్ అంటే ఓ జోష్ అని తమ అధినేతపై ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌పై నమ్మకంతోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story