- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ధవళేశ్వరంలో ప్రభుత్వ పత్రాలు దగ్ధం.. వాళ్లేనని మంత్రి నిమ్మల హాట్ కామెంట్స్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో పత్రాలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఆ పత్రాలు పోలవరం ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువ భూ సేకరణకు సంబంధించినవిగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్రాల దగ్ధంపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పత్రాలను వైసీపీ వాళ్లే తగలబెట్టారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని, ఎవరికి కనిపించకుండా మాయం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులను అసలు వదిలిపెట్టమని మంత్రి నిమ్మల హెచ్చరించారు.
Advertisement
Next Story