- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
విజయవాడ వరదలకు ఆ మూడే కారణం: మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ నగరం వరదలతో విలవిలలాడిన విషయం తెలిసిందే. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో బుడమేరు వాగు పొంగి నగరంలోని కాలనీలు, బస్తీల్లోకి వరద నీరు చేరింది. ఇళ్లు, రోడ్లపై 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. అయినా వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే బుడమేరుకు వరద ఉధృతి తగ్గుతోంది. పరిస్థితులు మెరుగవుతున్నాయి. అయితే బుడమేరుకు పడిన గండ్ల వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుడమేరకు పడిన గండ్లను ఆయన దగ్గరుండి పూడ్చివేయిస్తున్నారు. ఇప్పటికే రెండు గండ్లను శరవేగంగా పూడ్చారు. మూడో గండి పూడ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు గండ్లను పూడ్చితేనే వరదలు తగ్గుతాయన్నారు. ఆర్మీ సహాయంతో ఈ రోజు మూడో గండిని కూడా విజయవంతంగా పూడ్చివేస్తామని చెప్పారు. ప్రతి100 మీటర్లకు, 200 మీటర్లకు బుడమేరు గట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. ఈ గండ్ల వల్లే సింగ్ నగర్‌ను వరద నీరు చుట్టిముట్టాయని మంత్రి నిమ్మల తెలిపారు.