దావోస్‌లో కీలక భేటీ.. స్విస్ కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం

by srinivas |
దావోస్‌లో కీలక భేటీ.. స్విస్ కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్: స్విట్జర్లాండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని తాము భావిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. దావోస్ బెల్వడేర్‌లో స్విట్జర్లాండ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నికలస్ శామ్యూల్ గగ్గర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో లోకేశ్ మాట్లాడుతూ ఏపీలో నెస్లే, రొషే, నోవార్టిస్, ఎబిబి, క్లారియంట్, హిల్టీ, బుచర్, ఎస్‌టి టెలిమీడియా, ఒసి ఒర్లికా వంటి స్విస్ కంపెనీలను ఆహ్వానించేందుకు తాము ఆసక్తితో ఉన్నామన్నారు. వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు భాగాల విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ, ఆర్‌అండ్‌డీ హబ్‌ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ‘‘ఏపీ, స్విస్ విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేయడానికి మీ సహకారం అవసరం. ఏఐ, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్ట్-అప్‌లు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లలో ఏపీ, స్విట్జర్లాండ్‌లోని విశ్వవిద్యాలయాలను కనెక్ట్ చేయడంలో మీ మద్దతు అవసరం.’’ అని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

Next Story