- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై మంత్రి అప్పలరాజు ఘాటు వ్యాఖ్యలు.. ఖండించిన బొత్స
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన తీవ్ర వ్యాఖ్యలపట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కేసీఆర్ కుటుంబంపై మంత్రి సీదిరి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై సీదిరి వ్యాఖ్యలు దురృష్టకరమన్నారు. అలా మాట్లాడి ఉంటారని తాను అనుకోవడం లేదని ఒకవేళ మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక బాధ్యతగల వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయకూడదని సూచించారు. అలా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతామని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నేపథ్యంలో ఏపీపై మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ చేసిన ప్రకటనలకు మంత్రి సీదిరి అప్పలరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోసి తెలంగాణకు నాయకులయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు కల్లు తాగిన కోతిలా, ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీకు చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి కానీ ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా బిడ్ వేస్తామని అంటారా అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ అని మార్చేస్తే జాతీయ పార్టీ అయిపోతుందా అని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ కుటుంబంలో జాతీయవాదం అనేది ఏ కోశానా లేదని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడడం అభివృద్ధి కాదని, ఆంధ్రుల కష్టంతో.. కేవలం ఆంధ్రుల కష్టంతో హైదరాబాద్ బ్రహ్మాండమైన నగరంగా మారిందని చెప్పారు. తమ మామలా ఫాంహౌజ్‌లో కూర్చుని కల్లు తాగడం లేదని వ్యాఖ్యానించారు. ‘పాపం కవితక్కలాగా సీక్రెట్ చాట్స్ లేవు. మీలాగా లిక్కర్ స్కాంలు లేవు. మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’ అని మంత్రి హరీశ్ రావుకు మంత్రి సీదిరి అప్పలరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.