- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
25వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి : మండలిలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకెప్పుడు ప్రకటిస్తారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రశ్నించారు. శాసనమండలిలో శుక్రవారం డీఎస్సీ నోటిఫికేషన్‌పై మాట్లాడారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఏపీలో 40వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారని గుర్తు చేశారు.అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ మాత్రం కేవలం 8వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారని విమర్శించారు. ఇది సమంజసమైన సంఖ్య కాదని వ్యాఖ్యానించారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ నోటిషికేషన్ కూడా ఇవ్వలేదని అన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఎప్పుడు ప్రకటిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. ఇంతలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై చర్చకు పట్టుబట్టారు. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశశారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇక్కడకు వచ్చి గొడవ చేస్తే ఏమి లాభం అని టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.