AP News:అసెంబ్లీలో మంత్రి లోకేష్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యేల భేటీ..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:22 July 2024 8:14 AM  )
AP News:అసెంబ్లీలో మంత్రి లోకేష్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యేల భేటీ..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు(సోమవారం) ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఉభయ సభల సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి నారా లోకేశ్‌తో ఆయన చాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది వైసీపీ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో తాము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని, అలాంటిది ఏమైనా ఉంటే కలసి కూర్చుని చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్‌తో చెప్పారు. ఈ భేటీలో మంత్రి సత్య కుమార్ యాదవ్, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, ఈశ్వరరావు ఈ భేటీలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed