- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డే: శాంతి మాజీ భర్త మదన్
దిశ ఏపీ బ్యూరో (విజయవాడ): రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డే తన బిడ్డకు తండ్రి శాంతియే తనకు చెప్పిందని శాంతి మాజీ భర్త మదన్ మోహన్ మరోసారి స్పష్టం చేశారు. లీగల్‌గా ఆ బిడ్డకి తన పేరు తండ్రిగా ఉందని, కానీ ఆ బిడ్డ తనకు పుట్టిన బిడ్డకాదన్నారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో డెమెక్రటిక్ పార్టీ ఏపీ నాయకులు గుర్నాధంతో కలిసి మదన్‌మోహన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ....విశాఖ ఆస్పత్రి రికార్డుల్లో చూస్తే ఆ బిడ్డ తండ్రి పేరు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి ఉండటాన్ని చూసి షాక్ అయ్యానని చెప్పారు. సుభాష్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగానని తెలిపారు.
ఆస్పత్రి రికార్డుల్లో పేరు ఉన్నప్పటికీ శాంతి కన్న ఆ బిడ్డకూ తనకూ ఎలాంటి సంబంధమూ లేదని సుభాష్ అంటున్నాడన్నారు. శాంతి మాత్రం సుభాష్ రెడ్డి ఆ బిడ్డకి తండ్రి అని ఘంటాపదంగా చెబుతోందన్నారు. రేపు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలి కదా, భవిష్యత్తులో తండ్రి ఎవరో తెలియని బిడ్డ అంటే అతని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందన్నారు. తనకు ఇద్దరు ఆడ పిల్లలని.. తన భార్య మీద అన్యాయంగా అభాండాలు ఎందుకు వేస్తానని మదన్ మోహన్ ప్రశ్నించారు. తన భార్య మంచి బట్టలు, మంచి నగలు ధరించడం తప్పుకాదని, మంత్రులు, ఎంపీలతో మాట్లాడటం అస్సలు తప్పుకాదని, కానీ పిల్లలు మాత్రం కనకూడదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. విజయసాయిరెడ్డి పాత్ర లేదనుకుంటే ఎందుకు డీఎన్ఏ పరీక్షకు ముందుకు రావడం లేదననారు. డీఎన్ ఏ టెస్ట్ ద్వారా మాత్రమే ఆయన నిర్దోషిత్వం బయటపడుతుందని శాంతి మాజీ భర్త మదన్ మోహన్ తెలిపారు.
తనతో బలవంతంగా సంతకం పెట్టించిన ఫేక్ డాక్యుమెంట్ వాళ్లు చూపిస్తున్నారని మదన్ తెలిపారు. తనకు ఇటీవల తన భార్య శాంతి గురించి చాలా విషయాలు తెలిశాయని మదన్ మోహన్ పేర్కొన్నారు. ఈ ఆటలో తాను, శాంతి నలిగి పోతున్నామన్నారు. సుభాష్ రెడ్డి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాడో చెప్పాలన్నారు. విజయసాయి రెడ్డి బెదిరింపులు కారణమా? అని ప్రశ్నించారు. ఆ బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అని శాంతినే చెప్పిందని.. భవిష్యత్తు లో సమస్య రాకుండా డీఎన్ఏ టెస్ట్‌కి కోర్టు ద్వారా అనుమతి కోరతామని మదన్ మోహన్ వెల్లడించారు.