- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో లోకేశ్ మకాం : జాతీయస్థాయిలో మద్దతుకు ప్లాన్
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానం, రిమాండ్ విధించడం వంటి తదితర అంశాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు టీడీపీ సన్నద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపడుతంది. బాబుతో నేను పేరుతో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. టీడీపీ ఎంపీలతో కలిసి హస్తినలో తమ గళాన్ని వినిపించాలని నిర్ణయించారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు కుంభకోణానికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని జాతీయ మీడియాకు వివరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయని జాతీయ మీడియా సాక్షిగా లోకేశ్ వివరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టులతోపాటు రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చకు పట్టుబట్టేలా ఎంపీలకు నారా లోకేశ్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
జాతీయ నాయకులతోనూ భేటీ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని నారా లోకేశ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకపోయినప్పటికీ తన తండ్రి చంద్రబాబు నాయుడును రాజకీయ కక్షతో అరెస్ట్ చేసి రిమాండ్ విధించేలా వైసీపీ కుట్రలు చేసిందని లోకేశ్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. టీడీపీ ఎంపీ కే రామ్మోహన్ నాయుడుతో కలిసి గురువారం సాయంత్రం మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను, పరిస్థితులను జాతీయ స్థాయిలో లోకేష్ వివరించనున్నారు.ఈ కేసులో పలువురు కేంద్ర మంత్రులను, జాతీయ నాయకులను కలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయని జాతీయ మీడియాకు వివరించనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అలాగే రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలపై పార్లమెంటులోనూ చర్చించేలా ఎంపీలకు నారా లోకేశ్ దిశానిర్ధేశం చేయనున్నారు. మరోవైపు ఢిల్లీలో ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని, రఘురామ కృష్ణంరాజులతో కలిసి జాతీయ నాయకులను కలవనున్నట్లు తెలుస్తోంది.
కక్ష సాధింపుపై ప్రజంటేషన్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో సైతం స్పందన వచ్చింది. జాతీయ నాయకులు ఒక్కొక్కరుగా తమ మద్దతు తెలియజేస్తున్నారు. చంద్రబాబును రాజకీయకక్షతోనే అరెస్ట్ చేశారని జాతీయ స్థాయి నేతలు కోడై కూస్తున్నారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినతీరు హేయమని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇలాంటి తరుణంలో జాతీయ స్థాయిలో మరింత మద్దతు కూడగట్టేందుకు లోకేశ్ స్కిల్ స్కామ్ కేసులో జరుగుతున్న పరిణామాలపై నేషనల్ మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వాలని లోకేశ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ, ప్రభుత్వం కలిసి కుట్రలు చేస్తోందని...తమకు అనుకూలమైన ఛానెల్స్ ద్వారా చంద్రబాబు నాయుడుపై దుష్ప్రచారం చేస్తోందని ఇప్పటికే లోకేశ్ ఆరోపిస్తున్నారు. సీఐడీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు సైతం ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వాటన్నింటికి చెక్ పెట్టేందుకే నారా లోకేశ్ జాతీయ స్థాయిలో మీడియా దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, టీడీపీని టార్గెట్ చేయడం, ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ కార్యాలయాలపైనా, నేతలపైనా జరిగిన దాడుల గురించి ప్రత్యేకంగా లోకేశ్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడం... అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు వంటి అంశాలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లనున్నారు.
వ్యవస్థలపై దాడులను వివరించే యోచన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ స్కామ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తోంది. అలాగే టీడీపీ నేతల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అలాగే మార్గదర్శి వంటి సంస్థలపై ఊపిరి సలపకుండా జరుపుతున్న దాడులు.. అమరరాజా వంటి సంస్థలపై దాడులు, కియా సంస్థల దగ్గర వైసీపీ నేతల అరాచకాలను నారా లోకేశ్ జాతీయస్థాయి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసిందని అందుకు గల కారణాలను వివరించనున్నారు. 73 ఏళ్ల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఎఫ్ఐఆర్‌లో కూడా పేరు లేకుండా... గవర్నర్ అనుమతి లేకుండా.. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.