మరణించినా బతికి ఉండటం ఆయనకే సాధ్యం: లక్ష్మి పార్వతి

by Gantepaka Srikanth |   ( Updated:2024-05-28 11:05:38.0  )
మరణించినా బతికి ఉండటం ఆయనకే సాధ్యం: లక్ష్మి పార్వతి
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మంగళవారం ఆమె హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో మళ్లీ సుపరిపాలన అందించే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఎన్నేళ్లు అయినా తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను స్మరించుకోక మానరు అని అన్నారు. మరణించి ఏళ్లు గడిచినా అందరి గుండెళ్లో బతికి ఉన్న మహానుభావుడు ఎన్టీఆర్ అని లక్ష్మీ పార్వతి అన్నారు. జూన్‌ 4వ తేదీ తర్వాత జగన్‌ ఏపీ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed