- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yemmiganur: ప్రేమ పేరుతో షికార్లు తిప్పి.. చివరకు..!
దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరుకు చెందిన దళిత యువతి, నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన చాకలి రాఘవేంద్ర రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి మెలిసి తిరిగారు. తీరా పెళ్లి చేసుకోమని యువతి అడగటంతో రాఘవేంద్ర ముఖం చాటేశారు. తమ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో యువతి ఆందోళనకు దిగారు. ప్రియుడు రాఘవేంద్రపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదని రాఘవేంద్ర ఇంటి ముందు బైఠాయించారు.
మరోవైపు రాఘవేంద్రపై ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్‌తో పాటు స్పందనలోనూ జిల్లా S.Pకి ఫిర్యాదు చేశానని బాధితురాలు ఆరోపించారు. కానీ రాఘవేంద్రపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలలుగా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు తనకు న్యాయం చేయలేదని, ప్రియుడు జాడను కనుగొనలేదని వాపోయారు.