Yemmiganur: కర్ణాటక మద్యం పట్టివేత... ఇద్దరి అరెస్ట్

by srinivas |
Yemmiganur: కర్ణాటక మద్యం పట్టివేత... ఇద్దరి అరెస్ట్
X

దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురంకు చెందిన ఇద్దరు యువకులు అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా సెబ్ అధికారులు పట్టుకున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నందవరం మండలం నాగలదిన్నె బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన రెండు ద్విచక్ర వాహనాల్లో 384 ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను తరలించే ప్రయత్నం చేశారు. అనుమానం రావడంతో ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేశారు. కర్ణాటకు చెందిన మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితులపై గతంలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story