Kurnool: భూమా అఖిలప్రియకు టికెట్ ఇస్తే ఓడిస్తాం..!

by srinivas |   ( Updated:2023-05-17 12:33:36.0  )
Kurnool: భూమా అఖిలప్రియకు టికెట్ ఇస్తే ఓడిస్తాం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనపై ఆయన కుమార్తె జశ్వంతిరెడ్డి ఘాటుగా స్పందించారు. మాజీమంత్రి భూమా అఖిలప్రియకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అఖిలప్రియకు టికెట్ ఇస్తే ఆమెను ఓడించేందుకు ప్రయత్నిస్తామని తేల్చి చెప్పారు. భూమా అఖిల ప్రియకు టికెట్ అంటూ ఇస్తే ఆమె పతనం కోసం పని చేస్తామని తేల్చి చెప్పేశారు. అఖిలప్రియను ఓడించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని స్పష్టం చేశారు. నడి రోడ్డుపై బరి తెగించి ఎత్తుకుని పెంచిన ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ దాడి చేయడంతో తన స్థాయి ఏమిటో నిరూపించుకుందని జశ్వంతిరెడ్డి ధ్వజమెత్తారు. అఖిలప్రియ వంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని ప్రజలకు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గానీ, తన తండ్రి గానీ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని జశ్వంతి రెడ్డి తెలిపారు. ప్రతీసారి ఉమెన్‌కార్డును చూపిస్తూ సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

ప్రెస్‌మీట్‌లకు పిల్లాడిని తీసుకురాకుండా.. సరిగ్గా అరెస్ట్‌ సమయంలో సంకలో పిల్లాడిని వేసుకుని సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ విరుచుకుపడ్డారు. అఖిలప్రియ నీచమైన బతుకు బతుకుతోందని ఘాటుగా విమర్శలు చేశారు. తన తండ్రిపై అఖిలప్రియ ఏదైతే చేయించిందో భవిష్యత్‌లో ఆమెకు తగిన శాస్తి జరుగుతుందని శాపనార్థాలు పెట్టారు. భూమా అఖిలప్రియకు టికెట్ ఇస్తే ఏవీ వర్గం అంతా ఆమెను ఓడించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని, పార్టీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలు ఫాలో అవుతూ.. ఏ ప్రెస్‌మీట్‌ పెట్టలేదని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టత ఇచ్చేందుకు తాను సెల్ఫీ వీడియో విడుదల చేసినట్లు వెల్లడించారు.

Also Read..

విశాఖలో చంద్రబాబు కు ఘనస్వాగతం

Advertisement

Next Story