నారా లోకేశ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్: Devineni Avinash

by srinivas |   ( Updated:2023-08-19 11:19:31.0  )
నారా లోకేశ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్: Devineni Avinash
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఆరోపించారు. కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఆయన విమర్శలు కురిపించారు. బెజవాడ బఫూన్లు టీడీపీ ఇంచార్జులుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న చిల్లర వ్యక్తి అని విమర్శించారు. సీఎం జగన్ తన ఇంటికి వస్తే కుట్రలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు అంటున్నారని దేవినేని అవినాశ్ మండిపడ్డారు.

‘విజయవాడలో కూడా లోకేశ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది. టీడీపీ నాయకులు ఏదో విధంగా లోకేశ్ పాదయాత్రను జాకీలు వేసి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. లోకేశ్ పాదయాత్రపై దాడులు, అల్లర్లు చేస్తున్నారని టీడీపీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. విజయవాడలో నారా లోకేశ్ ఎక్కడ తిరిగినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు హయాంలో విజయవాడ సిటీలో చేయలేని పనులను మా నాయకుడు జగన్ చేస్తున్నారు. విజయవాడ రిటైనింగ్ వాల్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ బ్రిడ్జి, బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్, కరకట్ట ప్రాంతాలను నిర్మించాం. జగన్ 4 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో తెలుసుకోవడానికైనా నారా లోకేశ్ పాదయాత్ర చేయాలి.’ అని దేవినేని అవినాశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story