- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Prakasam Barrage: గేట్లను బోట్లు ఢీకొట్టిన కేసులో ఇద్దరి అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు. బోట్ల యజమానులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బ్యారేజీని ఢీకట్టడంలో కుట్ర ఉందనే కోణంలో రామ్మోహన్, ఉషాద్రిని ప్రశ్నిస్తున్నారు.
కాగా AP-IV-M-SB-0017, AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023 నెంబర్లున్న బోట్లు..ఇటీవల ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. దీంతో బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బోట్లు తమవేనని ఎవరూ రాకపోవడంతో అధికారులకు అనుమానాలను కలిగాయి. దీంతో విచారణ చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల బోట్లుగా తేలింది. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేశ్ అనుచరులు ఉషాద్రి. రామ్మోహన్‌కు చెందిన బోట్లనే వినియోగించారని నిర్ధారించారు. దీంతో విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.