- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vangaveeti Ranga Issue: దేవినేని అవినాశ్ వర్సెస్ బోండా ఉమా
దిశ, వెబ్ డెస్క్: వంగవీటి రంగా హత్య అంశం ఏపీలో రాజకీయ వేడిని రేపింది. 'రంగా వర్థంతి' సందర్భంగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారం అయ్యాయి. రంగా హత్య కుట్ర చేసిన వాళ్లు టీడీపీలో చేరారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు.
తాజాగా బోండా ఉమా, దేవినేని అవినాశ్ మధ్య మాటల యుద్ధం సాగింది. రంగా చనిపోయిన రోజు దేవినేని నెహ్రూ పక్కనే ఉన్నారని.. కొడాలి నాని నెహ్రూ దొడ్డిలో ఉన్నాడని బోండా ఉమా ఆరోపించారు. రంగా వర్థంతిని ఏ సామాజిక వర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి ఎవరు అని ఆయన ప్రశ్నించారు.
ఇందుకు వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమా ఒక చిల్లర వ్యక్తి అని, బజారు మనిషి అని విమర్శించారు. బోండా ఉమా కుటుంబంపై చెప్పాలంటే చాలా ఉందని దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు.
కాగా దేవినేని నెహ్రూ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని అవినాశ్ 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరారు..