కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి

by Seetharam |   ( Updated:2023-07-04 10:40:46.0  )
కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి
X

దిశ,వెబ్‌డెస్క్: బీజేపీ ఎన్నికల సమయంలో దూకుడు పెంచింది. బీజేపీని నమ్ముకుని వచ్చిన పెద్దనాయకులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారికి కీలక పదవులను కట్టబెట్టింది. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ కీలక పదవి అప్పగించింది. జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియమించింది. తద్వారా ఆయన సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోనుంది. కిరణ్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి

Next Story

Most Viewed