- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కిల్ స్కాం కేసులో కీలక పరిణామం: మరొకరికి రెగ్యులర్ బెయిల్ మంజూరు
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీమెన్స్ కంపెనీ డైరెక్టర్ గంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. సీమెన్స్ ఇండియా కంపెనీ డైరెక్టర్ గంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌కు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. ఇకపోతే గతంలో స్కిల్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సత్యభాస్కర్ ప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మంగళవారం ఈ కేసుపై విచారణ జరిగింది. సీమెన్స్ ఇండియా కంపెనీ డైరెక్టర్ గంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్ మధ్యంతర బెయిల్‌ను పూర్తి స్థాయి బెయిల్‌గా మారుస్తూ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో మధ్యంతర బెయిల్
ఇదిలా ఉంటే స్కిల్ స్కాం కేసులో గంటి వెంకట సత్య భాస్కర్ ప్రసాద్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో సీఐడీ సత్యభాస్కర్‌ను ఏ 35గా చేర్చింది. అనంతరం సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో తొలుత సత్యభాస్కర్ ప్రసాద్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. అనంతరం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. అయితే పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు నిందితుడికి అవినీతి నిరోధక చట్టం వర్తించదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రిమాండ్ విధించేందుకు నిరాకరించింది. దీంతో ఏపీ హైకోర్టును సీఐడీ ఆశ్రయించగా ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ సత్యభాస్కర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ రెడ్డి నిరాకరించారు. దీంతో సత్యభాస్కర్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సత్యభాస్కర్ ప్రసాద్‌కు ఆగస్టు 22న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. ఇకపోతే ఈ కేసులో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సైతం ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.