కేశినేని నాని కోవర్టు.. బుద్దా వెంకన్న సంచలన ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-01-20 09:56:12.0  )
కేశినేని నాని కోవర్టు.. బుద్దా వెంకన్న సంచలన ట్వీట్
X

దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కేశినేని నానిపై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. కేశినేని నాని కోవర్టు అని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ఆయన కోవర్టనే విషయం తెలియక టీడీపీ అధినేత చంద్రబాబు గౌరవించారని చెప్పారు. కోవర్టు అని తెలుసు కాబట్టే కేశినేని నానిని జగన్ అగౌరవించారని బుద్దా వెంకన్న ఓ వీడియో ట్వీట్ చేశారు. సతీసమేతంగా ఆలయ దర్శనం తర్వాత చంద్రబాబు బయటకు వస్తుండగా కేశినేని నాని దూరంగా ఎక్కడో ఉండడం వీడియోలో కనిపించింది. అయితే, తన పక్కన ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి కేశినేని నానిని చంద్రబాబు దగ్గరకు పిలిపించుకోవడం కనిపిస్తోంది. దూరంగా ఉన్న వ్యక్తిని పిలిపించుకుని చంద్రబాబు తన పక్కన చోటిచ్చి గౌరవించారని బుద్దా వెంకన్న చెప్పారు.

ప్రస్తుతం కేశినేని నానిని జగన్ అగౌరవించిన తీరును మరో వీడియోలో వెంకన్న చూపించారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి కేశినేని నాని బొకే ఇచ్చి నమస్కరించడం, ఆ బొకేను ఎడమచేతితో అందుకుని వెంటనే పక్కన ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో నేతను జగన్ ఆప్యాయంగా తట్టడం కనిపించింది. ఇదీ కేశినేని నానికి జగన్ ఇచ్చిన మర్యాద అని బుద్దా వెంకన్న అన్నారు. ఆ వీడియోకి అప్పుడు.. ఇప్పుడు అనే క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్ లో పెట్టారు. గతంలో కేశినేని నానిని చంద్రబాబు ఎలా మర్యాదగా చూసుకునేవారో, ఇప్పుడు జగన్ ఎలా చూశారో ఆ వీడియోలో స్పష్టంగా అర్ధం అవుతోందని బుద్దా వెంకన్న తెలిపారు.

Read More..

చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం

Advertisement

Next Story