- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల, సునీతకు బిగ్ షాక్.. వివేకా హత్య కేసుపై కడప కోర్టు కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ వివేకా హత్యకు వైసీపీ నేతలే కారణమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితర ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు వివేకా హత్యకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినేనని ఆరోపిస్తున్నారు. దీంతో వివేకా మర్డర్ కేసుపై ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్థావన తీసుకురావడానికి వ్యతిరేకంగా వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు.
వైఎస్ వివేకా హత్య విషయంపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కడప కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్యపై ఇకపై ఎవరూ మాట్లాడకూదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య ప్రస్థావన తీసుకురావొద్దని వైఎస్ సునీత, షర్మిల, నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలను న్యాయస్థానం ఆదేశించింది.