Kadambari Jethwani:కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం.. ఇద్దరు పోలీసులపై వేటు వేసిన డీజీపీ

by Maddikunta Saikiran |   ( Updated:2024-09-14 01:06:12.0  )
Kadambari Jethwani:కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం.. ఇద్దరు పోలీసులపై వేటు వేసిన డీజీపీ
X

దిశ, వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై(Mumbai) హీరోయిన్‌ కాదంబరి జత్వానీ(Kadambari Jethwani) వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.తనతో పెళ్లికి నిరాకరించానన్న కారణంతో వైసీపీ(YCP) నేత కుక్కల విద్యాసాగర్(Kukkala Vidyasagar) తో పాటు ఇద్దరు పోలీసు అధికారులు తనను వేధింపులకు గురిచేశారని ఏపీ ప్రభుత్వంతో పాటు విజయవాడ పోలీసులకు జత్వానీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించిన ఇద్దరు పోలీసులపై డీజీపీ(DGP) ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumalarao) వేటు వేశారు.ఈ కేసుని డీల్ చేసిన అప్పటి విజయవాడ ACP హనుమంతరావు(Hanumanta Rao),ఇబ్రహీంపట్నం CI ఎం.సత్యనారాయణ(Satyanarayana)ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు CI లు,ఒక SI పాత్ర ఉందని పోలీసు ఉన్నత అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో కీలకంగా వ్యవరించిన IPSలు పి.సీతారామాంజనేయులు(Seetaramanjaneyulu),విశాల్ గున్నీ(Vishal Gunni),కాంతి రాణా(Kanti Rana)లపై జత్వానీ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో వీరిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story