- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రంప్‌కి వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్.. ఏమనంటే..

దిశ, డైనమిక్ బ్యూరో : మన దేశ పౌరులకు బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. విశాఖలో ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ వారిని ఆ విధంగా చూడటానికి వారు ఉగ్రవాదులా..? రేపిస్టులా..? అని ధ్వజమెత్తారు. దేశ ప్రధాని ఏమి చేస్తున్నారు..? మోడీ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని ఆయన సూచించారు. విదేశాంగ మంత్రి జయశంకర్ ఇడియట్అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చైనాను ఎదురించడానికి అమెరికాకు మన సహకారం చాలా అవసరం అన్నారు. ఒకప్పుడు మోడీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు తెగ పొగుడుతున్నారని అన్నారు. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ ఎంపీ భరత్ మావయ్య పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారా అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి వార్నింగ్ ఇస్తున్నా.. నేను భారతీయుల కోసం నేను ఏమైనా చేస్తాను.. అని ఆయన హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ గళాన్ని విప్పాలన్నారు. లోకేష్ కు వాళ్ళ నాన్న దోచుకోవడమే లోకేష్ కు నేర్పించాడనని ఆరోపించారు. వాళ్ళ దగ్గర పవన్ నేర్చుకొని రూ. కోట్లు దోచుకుంటున్నాడని అన్నారు. ఢిల్లీ పెద్దలు కూడా నన్ను కలుస్తారు.. జగన్ ఎందుకు కలవరని ప్రశ్నించారు.